జోజు జార్జ్ - షాజీకైలాష్ కాంబో మూవీ ‘వరవు’
ఈ ప్రాజెక్ట్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. “రివెంజ్ ఈజ్ నాట్ ఎ డర్టీ బిజినెస్” అనే ట్యాగ్‌లైన్‌తో టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.;
మలయాళ విలక్షణ నటుడు జోజు జార్జ్, సక్సెస్ ఫుల్ సీనియర్ డైరెక్టర్ షాజి కైలాస్ మొదటిసారిగా కొలాబరేట్ అయి.. ‘వరవు’ (రాక) అనే కొత్త మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. “రివెంజ్ ఈజ్ నాట్ ఎ డర్టీ బిజినెస్” అనే ట్యాగ్‌లైన్‌తో టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా స్క్రీన్‌ప్లేను షాజి దీర్ఘకాల సహకారి, స్క్రీన్‌రైటర్.. దర్శకుడు ఏకే సాజన్ రాశారు. ఇతను గతంలో షాజి దర్శకత్వంలో సురేష్ గోపీ నటించిన ‘చింతామణి కొలకేస్’, మోహన్‌లాల్ ‘రెడ్ చిల్లీస్’, మమ్ముట్టి నటించిన ‘ధ్రోణ 2010’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ‘వరవు’ చిత్రాన్ని ఒల్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నైసీ రెజీ నిర్మిస్తున్నారు. జోమీ జోసెఫ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ మున్నార్, మరయూర్, కంతల్లూర్, తేని వంటి ప్రధాన లొకేషన్లలో జరుగనుంది. జోజు ఇటీవల జీతూ జోసెఫ్ దర్శకత్వంలో బిజు మేనన్‌తో కలిసి ‘వలదు వశత్తే కళ్ళన్’ షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన సీనియర్ నటి ఉర్వశీతో కలిసి ‘ఆశ’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో, జోజు తన రెండవ దర్శకత్వ చిత్రం ‘డీలక్స్’ను ప్రారంభించనున్నారు. ఇది 2024లో విడుదలైన ‘పని’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనుంది. ఇది జోజు దర్శకుడిగా తొలి చిత్రం. షాజి కైలాష్ గత చిత్రం 2024లో విడుదలైన ‘హంట్’ అనే హారర్ సినిమా. ఇందులో భావనా ప్రధాన పాత్రలో నటించింది. మరి ‘వరవు’ తో జోజు ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.