మాలీవుడ్ మహా మల్టీస్టారర్ కశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం
ఈ షెడ్యూల్‌లో నటులు కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్ పాల్గొంటున్నారు. ఒక పాటను చిత్రీకరించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం.;
మాలీవుడ్ మెగాస్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ హీరోలుగా మహేశ్ నారాయణన్ తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ కశ్మీర్‌లో కొద్ది రోజుల రామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో నటులు కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్ పాల్గొంటున్నారు. ఒక పాటను చిత్రీకరించే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. బృందం కశ్మీర్‌కు ప్రయాణించడం, షూటింగ్ సన్నాహాల దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మోహన్‌లాల్, మమ్ముట్టితో పాటు.. ఇంకా ఫహద్ ఫాసిల్, నయనతార, రేవతి, జరీన్ షిహాబ్, గ్రేస్ ఆంటోనీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే శ్రీలంక, న్యూ ఢిల్లీ, కొచ్చి, మరియు కొన్ని విదేశీ లొకేషన్లలో చిత్రీకరణ జరిపింది. మమ్ముట్టి, వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్న తర్వాత, బృందంలో చేరిన తర్వాత పూర్తిస్థాయి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. మోహన్‌లాల్ గతంలో ఈ చిత్రం టైటిల్‌ను ‘పేట్రియాట్’ అని వెల్లడించినప్పటికీ, మహేష్ నారాయణన్ ఇటీవలి సంభాషణలో దానిని కన్ఫర్మ్ చేయలేదు.
ఈ చిత్రానికి ‘డంకి, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాలకు పనిచేసిన మనుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్నారు, సీఆర్ సలీమ్, సుభాష్ మాన్యువల్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.