జీతు జోసెఫ్ మరో థ్రిల్లర్ మూవీ షూటింగ్ పూర్తి

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వలదు వశత్తే కళ్ళన్’ (కుడి వైపున దొంగ) చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు;

By :  K R K
Update: 2025-08-11 09:00 GMT

మాలీవుడ్ హిచ్ కాక్ అని పిలుచుకొనే జీతూ జోసెఫ్ దర్శకత్వంలో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వలదు వశత్తే కళ్ళన్’ (కుడి వైపున దొంగ) చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం డినూ థామస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీని నేరం, నీతి కలగలిసిన ఉత్కంఠభరిత కథ గా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో లీనా, నిరంజనా అనూప్, ఇర్షాద్ అలీ, మనోజ్ కె యు, ఆడుజీవితం ఫేమ్ కెఆర్ గోకుల్, లియోనా లిషాయ్, షాజు శ్రీధర్, దర్శకుడు శ్యామ్ ప్రసాద్ లాంటి నటులు ఉన్నారు. షాజీ నడేసన్ సమర్పణలో ఆగస్ట్ సినిమాస్, బెడ్‌టైమ్ స్టోరీస్, సినీహోలిక్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమైంది.

ఇంక జీతూ జోసెఫ్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ మూడో భాగంపై కూడా పనిచేస్తున్నారు. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత మోహన్ లాల్ హీరోగానే ‘రామ్’ అనే మూవీ ఫస్ట్ పార్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

Tags:    

Similar News