మాలీవుడ్‌లో 'కన్నప్ప' బ్యూటీ!
‘ఓం భీమ్ బుష్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.;
‘ఓం భీమ్ బుష్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ డెబ్యూ మూవీ హిట్ కావడంతో, కోలీవుడ్‌లో కూడా అవకాశం అందుకుని ‘స్టార్’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలు సాధించడం ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఈ జోరులోనే మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో నెమలి పాత్రలో తన నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోయినా తమిళం, మలయాళంలలో బిజీగా మారుతుంది ప్రీతి.
తాజాగా మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే ‘మైనే ప్యార్ కియా’ అనే టైటిల్‌తో హృదు హరూన్ హీరోగా నటించిన మలయాళ సినిమా కూడా పూర్తిచేసింది. ఈ చిత్రం ఓనం సందర్భంగా ఆగస్టు 29న విడుదల కానుంది. అదేవిధంగా మరో మాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు రెండు తమిళ సినిమాలు కూడా ప్రీతి చేతిలో ఉన్నాయి. మరి.. త్వరలోనే ఈ 'కన్నప్ప' బ్యూటీ టాలీవుడ్ లోనూ బిజీ అవుతుందేమో చూడాలి.