ట్రెడిషనల్ లుక్ లో మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.;
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో రకాల రూమర్స్, ఊహాగానాల మధ్య మోక్షు డెబ్యూ ప్రాజెక్ట్‌పై నిరంతరం చర్చ సాగుతోంది. ఇక తన డెబ్యూ మూవీ కోసం మోక్షజ్ఞ గత ఏడాది నుంచి నటనలో, డ్యాన్సులలో బాగా కష్టపడుతున్నాడని సమాచారం.
లేటెస్ట్ గా మోక్షు వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ పెళ్లికి హాజరైన మోక్షజ్ఞ ట్రెడిషనల్ లుక్ లో స్లిమ్ గా అదరగొడుతున్నాడు. ఈ లుక్ చూసిన అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ బద్దలే అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రకటించారు. కానీ కారణాలేమైనా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. మరోవైపు సూపర్ డూపర్ హిట్ ‘ఆదిత్య 369‘ సీక్వెల్ ‘ఆదిత్య 999‘ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ సినిమాని తొలుత బాలకృష్ణ స్వయంగా తెరకెక్కిద్దామనుకున్నా.. చివరకు క్రిష్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. నందమూరి తేజేస్విని, SLV సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి.