డబుల్ మేకోవర్ సర్‌ప్రైజ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ షాట్ పేరుతో వచ్చిన గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ షాట్ పేరుతో వచ్చిన గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ గ్లింప్స్ లో చరణ్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే.. ఈ మూవీలో చరణ్ ది మరో లుక్ కూడా ఉండబోతుందట. ప్రస్తుతం అందుకు సంబంధించి మేకోవర్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ గా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఓ వీడియోని పోస్ట్ చేసి పవర్‌ప్యాక్ లుక్స్ లోడింగ్ ఫర్ 'పెద్ది' అంటూ మెస్సేజ్ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో కలిసి రామ్ చరణ్ కొత్త లుక్ ట్రై చేస్తూ ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ సినిమాలో చరణ్ కి సంబంధించి ఒకటే లుక్ కాకుండా.. విభిన్న గెటప్స్ ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ ఆట కూలీ పాత్రలో కనిపించనున్నాడు. అంటే.. క్రికెట్ తో పాటు పలు ఆటల్లో నిష్ణాతుడిగా అలరించనున్నాడని తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవెల్ లో రెడీ అవుతున్న ఈ మూవీలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా మార్చి 27న 'పెద్ది' రిలీజ్ కు రెడీ అవుతుంది.