అవ్రామ్‌కి అవార్డ్.. మనోజ్ ఆనందం!

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించింది. ఈ చిత్రంతో ఆయన తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయమయ్యాడు.;

By :  S D R
Update: 2025-08-18 04:42 GMT

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించింది. ఈ చిత్రంతో ఆయన తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయమయ్యాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకలో అవ్రామ్‌కి ప్రత్యేక అవార్డు లభించడం మంచు కుటుంబానికి రెట్టింపు ఆనందాన్ని తీసుకొచ్చింది.

అవార్డు అందుకున్న సందర్భంగా అవ్రామ్ తన ఆనందాన్ని పంచుకుంటూ – 'ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్లీ మీ ముందుకు తప్పకుండా వస్తా' అని తెలిపాడు. ఈ సందర్భంగా వేదికపై అతనితో పాటు తండ్రి మంచు విష్ణు, తాత మోహన్‌బాబు ఉండటం ఆ క్షణానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

అవ్రామ్ అవార్డును అందుకున్న వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు విష్ణు. ఈ వీడియోపై మంచు మనోజ్ స్పందించాడు. 'కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి నాన్న. ప్రత్యేకంగా విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుతో కలిసి అవార్డు అందుకోవడం చాలా స్పెషల్' అని తన పోస్టులో తెలిపాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా, నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, మనోజ్ తన అన్న మంచు విష్ణు పేరు ప్రస్తావించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచు కుటుంబంలో వివాదాలు ముగిసినట్టే అని కామెంట్స్ పెడుతున్నారు.



Tags:    

Similar News