‘హే భగవాన్‘ అంటోన్న సుహాస్
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉండే నటుల్లో సుహాస్ ముందు వరుసలో నిలుస్తాడు. ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘ఓ భామ అయ్యో రామ‘ ఫలితం ఆశించినంతగా రాకపోయినా, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు.;
By : S D R
Update: 2025-08-18 08:00 GMT
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉండే నటుల్లో సుహాస్ ముందు వరుసలో నిలుస్తాడు. ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘ఓ భామ అయ్యో రామ‘ ఫలితం ఆశించినంతగా రాకపోయినా, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఈకోవలోనే లేటెస్ట్ గా ‘హే భగవాన్‘ అనే మూవీని అనౌన్స్ చేశాడు.
ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా శివాని నాగారం నటిస్తుంది. సీనియర్ నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ఓపెనింగ్ తో పాటు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. కామెడీ జానర్ లో రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. త్రిషూల్ విజనరీ స్టూడియోస్ పై బి.నరేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.