అర్జున్ అశోకన్ ‘సుమతి వళవు’ షూటింగ్ పూర్తి !
మాలీవుడ్ యంగ్ హీరో.. అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం ‘సుమతి వళవు’ షూటింగ్ పూర్తయింది. 84 రోజుల పాటు సాగిన చిత్రీకరణ జరగగా.. చివరి రోజు చిత్ర బృందం సభ్యులను గౌరవిస్తూ.. వారికి కొత్త దుస్తులను బహుమతిగా అందజేయడంతో పాటు అదనపు ఒక రోజు పారితోషికం కూడా అందించారు. మురళి కున్నుంపురత్ ‘వాటర్‌మ్యాన్ ఫిలిమ్స్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ ద్వారా థింక్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను మే 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రం ‘మాలికప్పురం’ చిత్రంతో విజయాన్ని అందుకున్న రచయిత అభిలాష్ పిళ్లై, దర్శకుడు విష్ణు శశి శంకర్ కలయికలో రూపొందింది. ఇదొక హారర్ చిత్రం కాగా.. ఈ కథలో ‘సుమతి వళవు’ (సుమతి మలుపు) అనే శతాబ్దాలుగా భయానకతకు కేంద్రంగా ఉన్న ప్రదేశం ఉంది. సుమతి అనే తమిళ మహిళ ఆత్మ ఆ ప్రదేశాన్ని రక్షిస్తుందని.. కథాంశంగా మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ చిత్రంలో బాలు వర్గీస్, మాళవిక మనోజ్, గోకుల్ సురేష్, సైజు కురుప్, సిద్ధార్థ్ భరతన్, శివదా, శ్రవణ్ ముఖేష్, ‘పానీ’ ఫేమ్ బాబీ కురియన్, అభిలాష్ పిళ్లై, మనోజ్ కేయూ, గోపిక అనిల్, సిజా రోజ్, నందు, శ్రీజిత్ రవి, కొట్టాయం రమేష్, స్మిను సిజో, శ్రీపథ్యన్ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా ‘మాలికప్పురం’ చిత్రంలో బాల నటులుగా ఆకట్టుకున్న దేవానంద, శ్రీపథ్యన్ ఈ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.