షేన్ నిగమ్ మల్లూ క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’
తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో షేన్ పోలీస్ యూనిఫామ్‌లో అగ్రెసివ్ లుక్ తో కనిపిస్తున్నాడు.;
మలయాళ యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ లో, కొత్త దర్శకుడు మార్టిన్ జెసెఫ్ తెరకెక్కిస్తోన్న మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దృఢం’. ఈ చిత్రాన్ని థ్రిల్లర్ చిత్రాల మాస్టర్ జీతు జోసెఫ్ సమర్పిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్, ముకేశ్ ఆర్ మెహతా మరియు సీవీ సారథి నిర్మాతలుగా.. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో షేన్ పోలీస్ యూనిఫామ్‌లో అగ్రెసివ్ లుక్ తో కనిపిస్తున్నాడు.
"ప్రతి దర్యాప్తు ఒక ఆవిష్కరణతో మొదలవుతుంది" అని రచయితలు పోస్ట్ క్యాప్షన్‌లో రాశారు. "రక్షించు. సేవ చేయి. బతుకు." అనేది చిత్రం ట్యాగ్‌లైన్. జోమోన్ జాన్, లింటో దేవాసియా రాసిన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో హీరో షేన్ మాట్లాడుతూ, జీతూ ప్రజెంట్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో పనిచేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పాడు.
ఈ 4 ఎక్స్‌పెరిమెంట్స్, బెడ్‌టైమ్ స్టోరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాన్య, శోభి తిలకన్, కృష్ణ ప్రభ నాయర్, నందన్ ఉన్ని, దినేష్ ప్రభాకర్, కొట్టాయం రమేష్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతికంగా, సినిమాటోగ్రఫీ పీయం ఉన్నికృష్ణన్, ఎడిటింగ్ వినాయక్, ప్రొడక్షన్ డిజైన్ సునీల్ దాస్ చేపట్టారు. షేన్ రాబోయే ప్రాజెక్ట్‌లలో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ‘హాల్’, స్పోర్ట్స్ ఫిల్మ్ ‘బాల్టీ’ ఉన్నాయి. ఈ రెండూ సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్నాయి. మరోవైపు, జీతూ జోసెఫ్ .. ‘మిరాజ్, వలదు వశత్తే కళ్ళన్, దృశ్యం 3, రామ్: పార్ట్ 1 చిత్రాలు ఉన్నాయి.