మోహన్ లాల్ జైలర్ 2లోకి ఎంట్రీ!

Update: 2025-07-09 06:03 GMT

మోహన్ లాల్ జైలర్ 2లోకి ఎంట్రీ!సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జైలర్ 2 చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ జైలర్ 2 సెట్స్‌లోకి అడుగుపెట్టారు. జూలై చివరికి ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయనున్నారు.

ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, బాలకృష్ణ ముఖ్యమైన శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యామియో చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రమ్యకృష్ణ, ఫహద్ ఫాసిల్, మిర్నా మీనన్ వంటి నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అలరించబోతున్నారు. బాక్సాఫీస్‌పై తన శక్తిని మళ్లీ ప్రదర్శించనున్న రజనీ జైలర్ 2తో మరో విజయం సాధిస్తారని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.

Tags:    

Similar News