'మిరాయ్' టీజర్.. ప్యూర్ విజువల్ ట్రీట్!

తేజ సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' సంచలన విజయాన్ని సాధించింది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి మెయిన్ థీమ్ సూపర్ హీరో కాన్సెప్ట్.;

By :  S D R
Update: 2025-05-28 05:18 GMT

తేజ సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' సంచలన విజయాన్ని సాధించింది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి మెయిన్ థీమ్ సూపర్ హీరో కాన్సెప్ట్. ఇప్పుడు మళ్లీ అలాంటి థీమ్ తోనే 'మిరాయ్' మూవీతో ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నాడు తేజ సజ్జ.

పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అశోకుడి కాలం నాటి కథతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో బ్లాక్ స్వార్డ్‌గా మెయిన్ విలన్ రోల్ లో మురిపించబోతున్నాడు మంచు మనోజ్. రితిక నాయక్ ఫీమేల్ లీడ్ చేస్తుంది. ఇంకా ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, జయరామ్ వంటి వారు కనిపించబోతున్నారు.

ఇప్పటికే గ్లింప్సెస్ తో ఆకట్టుకున్న 'మిరాయ్' నుంచి టీజర్ వచ్చేసింది. 2 నిమిషాల 19 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం విజువల్ ట్రీట్ అందిస్తుంది. విలన్ గా మంచు మనోజ్ వీర విహారం చేస్తున్నాడు. సూపర్ యోధ మిరాయ్ గా తేజ సజ్జ మరోసారి యాక్షన్ లో ఇరగదీయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తంగా.. 'మిరాయ్' టీజర్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచిందని చెప్పాలి. సెప్టెంబర్ 5న 'మిరాయ్' పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News