'విశ్వంభర'పై మెగా అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’ ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్‌లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 45 నిమిషాల గ్రాఫిక్స్ ఫుటేజ్‌ను చిరు వీక్షించారు.;

By :  S D R
Update: 2025-07-11 01:11 GMT

మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’ ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్‌లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 45 నిమిషాల గ్రాఫిక్స్ ఫుటేజ్‌ను చిరు వీక్షించారు. అవుట్‌పుట్ పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసిన మెగాస్టార్, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయడానికి డేట్లు ఇవ్వనున్నట్లు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం స్పెషల్ సాంగ్, కొన్ని ప్యాచ్‌వర్క్ సీన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్పెషల్‌ నంబర్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఆన్‌ బోర్డులోకి వస్తోంది.

ప్రస్తుతం మేకర్స్ 'విశ్వంభర' చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అదే నెల 25న పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ అయినా, కాకపోయినా తమ నిర్ణయంలో మార్పు ఉండదని తెలుస్తోంది. టీజర్ పరంగా కొంత నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఓ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది టీమ్.

మరోవైపు మెగా బర్త్ డే స్పెషల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 టైటిల్ టీజర్ కూడా రానుంది. అంటే.. వచ్చే ఆగస్టులో చిరు బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అన్నమాట. ఇక.. 'విశ్వంభర' చిత్రంలో చిరు సరసన త్రిష నాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, ఇషా చావ్లా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొత్తంగా.. త్వరలోనే 'విశ్వంభర' విడుదల తేదీపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News