అల్లు అర్జున్ కు విలన్ గా రష్మికా మందన్న?

రష్మికా ఈ టైటిల్ పెట్టని సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుందని టాక్. ఈ పాత్ర రష్మికాకు టోటల్‌గా కిక్ ఇచ్చిందట. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.;

By :  K R K
Update: 2025-07-11 07:30 GMT

టాలీవుడ్ లో క్రేజీ హైప్ క్రియేట్ అయిన చిత్రాల్లో అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కిక్‌స్టార్ట్ అయ్యింది. దీన్నొక విజువల్ స్పెక్టాక్యులర్ గా అట్లీ తీర్చిదిద్దుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ రికార్డ్ బడ్జెట్‌తో, . గ్రాండ్ స్కేల్‌లో... తెరకెక్కుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. రష్మికా ఈ టైటిల్ పెట్టని సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుందని టాక్. ఈ పాత్ర రష్మికాకు టోటల్‌గా కిక్ ఇచ్చిందట. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

మేకర్స్ త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక అనౌన్స్‌మెంట్ డ్రాప్ చేయబో తున్నారు. ఈ సినిమాలోని కేస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. బాలీవుడ్ సెన్సేషన్స్ దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్‌లుగా ఫైర్ బ్రాండ్ పెర్ఫార్మెన్స్‌లతో మెస్మరైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ టీమ్ ముంబైలో రెండు షూటింగ్ షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసేసింది.

2026 మిడ్ నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసి, ఈ బిగ్ టికెట్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటిదాకా దేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటిగా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ భారీ ఎంటర్‌టైనర్ 2027లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News