సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మళ్ళీ శ్రీవిష్ణు ?
శ్రీ విష్ణుకు ఒక ఫన్నీ స్క్రిప్ట్‌ను వినిపించి, గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడని టాక్. ‘సామజవరగమన’ రైటర్స్ భాను, నందు ఈ స్క్రిప్ట్‌పై మళ్ళీ రామ్ అబ్బరాజుతో కలిసి పని చేస్తున్నారు.;
‘సామజవరగమన’ సినిమా శ్రీ విష్ణు కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో శ్రీ విష్ణు కామిక్ టైమింగ్ ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంతో దర్శకుడిగా రామ్ అబ్బరాజు తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం అతడు శర్వానంద్‌తో 'నారి నారి నడుమ మురారి' సినిమాపై వర్క్ చేస్తున్నాడు. కానీ షూటింగ్‌లో ఆలస్యం కారణంగా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు. శ్రీ విష్ణుకు ఒక ఫన్నీ స్క్రిప్ట్‌ను వినిపించి, గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడని టాక్.
‘సామజవరగమన’ రైటర్స్ భాను, నందు ఈ స్క్రిప్ట్‌పై మళ్ళీ రామ్ అబ్బరాజుతో కలిసి పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ‘సామజవరగమన’ కాంబోను బ్యాంక్‌రోల్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. శ్రీ విష్ణు లాస్ట్ ఫిల్మ్ 'సింగిల్' బ్లాక్‌బస్టర్ హిట్. ప్రస్తుతం అతను రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది వాటిని పూర్తి చేసి.. వచ్చే ఏడాది రామ్ అబ్బరాజుతో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు. మరి రామ్ అబ్బరాజు ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ ను తీసుకుంటాడో చూడాలి.