యూఎస్ లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ !

యూ.ఎస్.లో ‘హరిహర వీరమల్లు’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-07-11 08:07 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు బిగ్ స్ర్కీన్ పై ఆయన అద్భుతమైన ప్రదర్శన కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎదురుచూపు మరో రెండు వారాల్లో ముగియనుంది. ఆయన మోస్ట్ అవైటింగ్ పాన్-ఇండియా హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. యూ.ఎస్.లో ‘హరిహర వీరమల్లు’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ నార్త్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ యూ.ఎస్.ఎ. అండ్ కెనడాలో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఏఎమ్ జ్యోతి కృష్ణ, క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏ దయాకర రావు నిర్మాణంలో ఏఎమ్ రత్నం సమర్పణలో రూపొందింది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News