‘మాస్ జాతర’ కు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది !

Update: 2025-10-02 04:40 GMT

మాస్ మహారాజా రవితేజ నటించిన "మాస్ జాతర" సినిమా రిలీజ్ డేట్స్ మారడంలో ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ఒక సినిమాకి ఇన్నిసార్లు వాయిదాలు పడడం ఆయన కెరీర్‌లో ఇదే మొదటిసారి. అస్తమాను పదే పదే ఆలస్యం అవుతుండడంపై రవితేజ కూడా రీసెంట్‌గా విడుదల చేసిన ఒక ప్రోమోలో ఓపెన్ అయ్యారు. ఒక రిలీజ్ డేట్‌ని ప్రకటించడానికి తాను ఇంత ఎంబరాస్ అవ్వడం ఎప్పుడూ లేదని ఫన్నీగా ఒప్పుకున్నారు.


ఈ సినిమా మొదట సంక్రాంతి 2025కి విడుదల కావాల్సి ఉండగా, ఆ తర్వాత మే 9కి, మళ్లీ ఆగస్టు 27కి వాయిదా పడింది. ఇప్పుడు.. ఇది అధికారికంగా అక్టోబర్ విడుదల జాబితాలో చేరింది. పలు ఆలస్యాల తర్వాత.. చివరికి ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల చేయాలని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ కంటిన్యూస్ డిలేస్‌తో ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్ నెలకొనగా, టీమ్ ఎట్టకేలకు అక్టోబర్ 31ని ఫైనల్ రిలీజ్ డేట్‌గా లాక్ చేసింది.

ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ, మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ మరియు హైపర్ ఆది పాత రిలీజ్ డేట్స్ మార్పుల గురించి మాట్లాడుకుంటూ నవ్వులు పూయించారు. వీడియో ఎండింగ్‌లో, రవితేజ నేరుగా నిర్మాత నాగ వంశీకి ఫోన్ చేసి, ఈసారి కచ్చితంగా అక్టోబర్ 31కే రిలీజ్ అని, ఇంకే మార్పు ఉండదని వినాయకుడిపై ప్రమాణం చేసి మరీ డేట్‌ను ఫిక్స్ చేశారు.

"మాస్ జాతర" సినిమా ఒక పోలీస్ డ్రామా. ఇందులో రవితేజ సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ పాత్రలో కనిపించనున్నారు. రవితేజకు పోలీస్ గెటప్ సెంటిమెంట్ ఉంది. ఈ పాత్ర తనకు బాక్సాఫీస్ సక్సెస్ ఇస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు. భాను భోగవరపు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

Tags:    

Similar News