మరోసారి మణి - సింబు కాంబో!
లెజెండరీ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' ను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్, యంగ్ స్టార్ సింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ఇంకా నెలరోజులే మిగిలి ఉండటంతో, "థగ్ లైఫ్" చుట్టూ హైప్ రోజురోజుకీ పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త "థగ్ లైఫ్" పై ఉన్న పాజిటివ్ బజ్‌ను మరింత పెంచేలా ఉంది. మణిరత్నం – సింబు కాంబినేషన్ మరోసారి రూపుదిద్దుకోనుందట. "థ గ్ లైఫ్" తో పాటు, ఈ ఇద్దరూ గతంలో 'చెక్కచివంత వానం' (తెలుగులో నవాబ్) అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో కలిసి పని చేశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది.
తాజా బజ్ ప్రకారం, ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ తో కలిసి, ఈ కొత్త మణి-సింబు చిత్రాన్ని నిర్మించనుంది. ప్రతిదీ అనుకున్నట్లే జరిగితే, ఈ చిత్రం సింబుకు 52వ ప్రాజెక్టుగా నిలవనుంది.