మ్యాగ్నమ్ ఓపస్ అప్డేట్
ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టి మొత్తం ఒకే ఒక క్రేజీ కాంబినేషన్‌పై ఉంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్.;
ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టి మొత్తం ఒకే ఒక క్రేజీ కాంబినేషన్‌పై ఉంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్. ఈ కలయికపై ఎంతో కాలంగా ఊహాగానాలు, అంచనాలు నడుస్తున్నా, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానులను సస్పెన్స్ లో పడేసింది.
అయితే లేటెస్ట్ గా ఈ క్రేజీ కాంబో గురించి బన్నీ వాస్ సర్ప్రైజింగ్ అంటూ ఓ ట్వీట్ చేయడం.. ఇప్పుడు సన్ పిక్చర్స్ మ్యాగ్నమ్ ఓపస్ అంటూ మరో అప్డేట్ అందించడంతో బన్నీ-అట్లీ కాంబో గురించి క్రేజీ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
'మాస్ మరియు మ్యాజిక్ కలిసినప్పుడు చూడదగిన స్పెషల్ అనుభవం ఉంటుంది' అనే అర్థం వచ్చేలా 'ఎ మ్యాగ్నమ్ ఓపస్ వేర్ మాస్ మీట్స్ మ్యాజిక్' అంటూ ఓ పోస్ట్ పెట్టింది సన్ పిక్చర్స్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. బన్నీ బర్త్‌డే స్పెషల్ గా ఈ స్పెషల్ కాంబో గురించి ఆసక్తికరమైన అప్డేట్ అందించబోతున్నట్టు ఈ విధంగా హింట్ ఇచ్చింది సన్ పిక్చర్స్.
అల్లు అర్జున్-అట్లీ సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ మాత్రమే కాకుండా స్పెషల్ గ్లింప్స్ వంటిది కూడా వదలబోతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎనర్జీ, అట్లీ స్టైల్ మేకింగ్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూడూ కలిసి ఒక విజువల్ ఫెస్టివల్‌ను క్రియేట్ చేయబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ కమర్షియల్ సినిమాలకి కొత్త ప్రమాణాలు సెట్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ తయారవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.