సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కుబేర‘

కింగ్ నాగార్జున, విలక్షణ నటుడు ధనుష్ మల్టీస్టారర్ ‘కుబేర‘ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 20న వరల్డ్ వైడ్ గా ‘కుబేర‘ థియేటర్లలోకి వచ్చేస్తుంది.;

By :  S D R
Update: 2025-06-18 07:27 GMT

కింగ్ నాగార్జున, విలక్షణ నటుడు ధనుష్ మల్టీస్టారర్ ‘కుబేర‘ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 20న వరల్డ్ వైడ్ గా ‘కుబేర‘ థియేటర్లలోకి వచ్చేస్తుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించింది. సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసింది.

‘కుబేర‘ సినిమా 3 గంటల 1 నిమిషం భారీ నిడివితో వస్తుంది. ఈమధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలలో ‘కుబేర‘ ఒకటిగా నిలవనుంది. ఇద్దరు స్టార్స్ ఉన్నా.. స్టోరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఇప్పటికే ప్రచార చిత్రాలతో అర్థమయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ మూవీకి మరో అసెట్. మొత్తంగా.. మూడు గంటలకు పైగా నిడివితో వస్తోన్న ‘కుబేర‘ ఆడియన్స్ ను ఏ విధంగా ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News