డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్!

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మెగా 157‘. అనౌన్స్ అయినప్పటినుంచే ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.;

By :  S D R
Update: 2025-06-18 06:31 GMT

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మెగా 157‘. అనౌన్స్ అయినప్పటినుంచే ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ముస్సోరీలోని అందమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ సాగుతుంది.

‘మెగా 157‘లో శివ శంకర్ వర ప్రసాద్ గా కనిపించబోతున్నాడు మెగాస్టార్. అంటే చిరు తన ఒరిజినల్ నేమ్ తో ఈ మూవీలో అలరించనున్నాన్న మాట. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుంది. మరో కీలక పాత్రలో కేథరిన్ కనిపించనుంది. ఇక.. లేటెస్ట్ గా ఈ సినిమాలో చిరంజీవి పోషించే పాత్రపై ఓ క్లారిటీ వచ్చేసింది.

‘మెగా 157‘లో మెగాస్టార్ డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నాడట. ప్రస్తుతం ముస్సోరీలో చిరు డ్రిల్ మాస్టర్ గా పనిచేసే స్కూల్ కి సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. మొత్తంగా.. మాస్ ను కాస్త పక్కన పెట్టి.. మెగాస్టార్ ఫుల్ క్లాస్ మోడ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ‘మెగా 157‘తో రెడీ అవుతున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

Tags:    

Similar News