యాంకర్ ను సర్ప్రైజ్ చేసిన విజయ్!
విలక్షణమే ప్రధానంగా సాగే కథానాయకులు కొంతమంది ఉంటారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్త కథలను పరిచయం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు.;
విలక్షణమే ప్రధానంగా సాగే కథానాయకులు కొంతమంది ఉంటారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్త కథలను పరిచయం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి హీరోల్లో ముందు వరుసలో నిలుస్తాడు విజయ్ ఆంటోని. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని.
లేటెస్ట్ గా విజయ్ ఆంటోని ‘మార్గన్‘ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మార్గన్‘ రాబోతుంది. వరుసగా హత్యలు జరుగుతుంటాయి.. ఆ హత్యల వెనుక రహస్యాన్ని చేధించే పోలీసాఫీసర్ గా ఈ మూవీలో విజయ్ ఆంటోని కనిపించబోతున్నాడు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ‘మార్గన్‘ బృందం తెలుగులో వరుస ఇంటర్యూలు ఇస్తుంది. ఈకోవలోనే తెలుగు యాంకర్ అంజలి.. ‘మార్గన్‘ టీమ్ ను ఇంటర్యూ చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ ఓ ఎమోషనల్ సన్నివేశంలో అంజలిని నటించి ఆడిషన్ ఇవ్వమని కోరగా, ఆమె తన అసాధారణ నటనతో అక్కడ అందరినీ ఆకర్షించింది. వెంటనే ‘మార్గన్‘ టీమ్ ఆమె నటనను మెచ్చుకోగా.. విజయ్ ఆంటోని ఒకడుగు ముందుకేసి తన నెక్స్ట్ మూవీలో అంజలికి మంచి పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడు.