విడుదలకు ముందే విజయం!

సినిమాలు తీయాలే గానీ చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. థియేట్రికల్ గా మాత్రమే కాకుండా టి.వి., ఓటీటీ లలోనైనా ఆయా చిత్రాలను వీక్షిస్తూనే ఉంటారు సినీ ప్రియులు.;

By :  S D R
Update: 2025-06-18 11:56 GMT

సినిమాలు తీయాలే గానీ చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. థియేట్రికల్ గా మాత్రమే కాకుండా టి.వి., ఓటీటీ లలోనైనా ఆయా చిత్రాలను వీక్షిస్తూనే ఉంటారు సినీ ప్రియులు. అయితే పెద్ద నిర్మాణ సంస్థలు పెద్ద సినిమాలకోసం సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఆయా అగ్ర నిర్మాత సంస్థలు చిన్న సినిమాలపైనా దృష్టి పెడితే అది పరిశ్రమకు మంచి చేకూరుస్తుంది.

టాప్ ప్రొడక్షన్ హౌజెస్ చిన్న సినిమాలను నిర్మిస్తే.. వాటికి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా కాస్టింగ్ తో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరుగుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ '8 వసంతాలు'. 'మ్యాడ్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది.

ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఫీమేల్ సెంట్రిక్ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఈ సినిమాని విడుదలకు ముందే జనాల్లోకి వెళ్లేలా చేసింది. దీంతో.. ఇప్పుడు '8 వసంతాలు' చిత్రం విడుదలకు ముందే నాన్‌-థియేట్రికల్ రూపంలో రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకూ వసూలు చేసిందట. జూన్ 20న 'కుబేర' తో పాటు '8 వసంతాలు' థియేటర్లలోకి వస్తోంది. మరి.. థియేట్రికల్ గా ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News