కోట గారి మృతి తీరనిలోటు.. చంద్రబాబు నాయుడు
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్‌ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.;
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్‌ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. 750కి పైగా చిత్రాల్లో నటించి, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణవార్త పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు మరణం ఎంతో విచారకరమని అన్నారు. 'వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు.