ఈ ఇద్దరూ యాక్టింగ్ ఇరగదీసేశారు !
మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్, కన్నడ నటీమణి రచితా రామ్‌లకు ఈ మూవీలో టాప్ ప్రయారిటీ దక్కింది. వీళ్ల క్యారెక్టర్స్‌కి స్క్రీన్ టైమ్, కథలో కీ రోల్, కోర్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌గా బాగా హైలైట్ అయ్యాయి.;
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిసి తమ లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం టీమప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ సాధించింది. ఇప్పుడు టాక్‌కి వస్తే.. ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి సోషల్ మీడియాలో ఫుల్ డిబేట్ జరుగుతోంది.
ముఖ్యంగా చెప్పాలంటే. మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్, కన్నడ నటీమణి రచితా రామ్‌లకు ఈ మూవీలో టాప్ ప్రయారిటీ దక్కింది. వీళ్ల క్యారెక్టర్స్‌కి స్క్రీన్ టైమ్, కథలో కీ రోల్, కోర్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌గా బాగా హైలైట్ అయ్యాయి. ఈ రెండు క్యారెక్టర్స్ సినిమా ఫ్లోతో పాటు ట్రావెల్ చేస్తూ, చుట్టూ మంచి డ్రామా క్రియేట్ చేశాయి.
మొత్తానికి ‘కూలీ’ చిత్రంలో ఈ ఇద్దరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. మూవీ వైబ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. రజనీకాంత్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్న సినిమాలో ఈ ఇద్దరికీ ఇంత స్పేస్ దొరకడం రేర్. కానీ.. వీళ్లు ఈ ఛాన్స్‌ని ఫుల్ యూజ్ చేసుకుని.. తమ యాక్టింగ్‌తో రాక్ చేశారు.