‘లియో’ రికార్డు ను బద్దలు కొట్టిన ‘కూలీ’

ఆశ్చర్యకరంగా.. ‘కూలీ’ సినిమా కేవలం మూడు రోజుల్లోనే దళపతి విజయ్ లియో మూవీ రికార్డు ను బద్దలు కొట్టింది.;

By :  K R K
Update: 2025-08-17 05:49 GMT

డెబ్బై ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ .. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన తాజా చిత్రం కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటేసింది. సుమారు రూ. 324 కోట్ల గ్రాస్ వసూళ్లతో.. ముఖ్యంగా మిశ్రమ రివ్యూలు, ‘వార్ 2’ వంటి బలమైన పోటీ మధ్యలో... ఈ మైలురాయిని సాధించడం అంత సులభం కాదు.

ఆశ్చర్యకరంగా.. ‘కూలీ’ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఈ రికార్డ్ సెట్ చేసింది. తమిళ చిత్రాల్లో అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న సినిమాగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు విజయ్ నటించిన ‘లియో’ చిత్రం పేరిట ఈ రికార్డు ఉండేది. అది ఐదు రోజుల్లో ఈ మార్క్‌ని దాటింది. ఈ ప్రక్రియలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సొంత రికార్డుని మళ్లీ బద్దలు కొట్టాడు.

ఆదివారం వసూళ్లు స్థిరంగా ఉంటాయని అంచనా. కానీ నిజమైన సవాలు సోమవారం నుంచి మొదలవుతుంది. ‘కూలీ’ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, రచిత రామ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు.

Tags:    

Similar News