‘ఇడ్లీకడై’ లోకి ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ!
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఈ రూరల్ ఎంటర్‌టైనర్‌లో ధనుష్ సిస్టర్ గానూ, అలాగే.. అరుణ్ విజయ్ వైఫ్ గానూ కనిపించనుంది.;
రాబోయే తమిళ రూరల్ డ్రామా మూవీ ‘ఇడ్లీకడై’. దీన్ని మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు .. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో కూడా కనిపించనున్నాడు. ముందుగా.. ఈ మూవీ ఏప్రిల్ 10న అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో క్లాష్ అవుతూ రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని పెండింగ్ వర్క్‌ల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది.
ఇప్పుడు ‘ఇడ్లీకడై’ మూవీ దసరా హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకుంటూ అక్టోబర్ 1, 2025న థియేటర్స్‌లోకి రానుంది. తమిళ హీరో అరుణ్ విజయ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఈ రూరల్ ఎంటర్‌టైనర్‌లో ధనుష్ సిస్టర్ గానూ, అలాగే.. అరుణ్ విజయ్ వైఫ్ గానూ కనిపించనుంది.
షాలినీకి ఇది ‘100% కాదల్’ తర్వాత సెకండ్ తమిళ మూవీ. షాలినీ ఇప్పుడు తన సినిమా సెలెక్షన్స్‌లో సూపర్ సెలెక్టివ్‌గా ఉంటోంది. ఆమె క్యారెక్టర్‌తో ధనుష్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్‌రోల్ చేస్తున్నాయి, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగులో ‘ఇడ్లీకొట్టు’ టైటిల్‌తో రిలీజ్ కానుంది.