కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ !

Update: 2025-02-25 03:40 GMT

కన్నడ రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "టాక్సిక్" చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇది ఇండియన్ స్ర్కీన్ పై మరొక ఘనత అని చెప్పాలి. పూర్తిగా ఇంగ్లీష్ , కన్నడ భాషల్లో తెరకెక్కించిన మొదటి భారీ ప్రాజెక్టుగా ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోనుంది. అంతేకాక.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం వంటి భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నారు. దీని వల్ల ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునే అవకాశం మరింత విస్తరించనుంది.

ఇంటర్నేషనల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి రచయితగా, దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. కన్నడ భాష భారతీయ ప్రేక్షకుల కోసం సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరిస్తుండగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకునేందుకు అనువుగా ఉండనుంది. ఇది కేవలం అనువాద చిత్రం కాకుండా, రెండు భాషల్లో సహజత్వాన్ని, ఎమోషన్స్ ను తెరపై ఆవిష్కరించబోతోంది. కేవీయన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ నారాయణ, యశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"టాక్సిక్" చిత్రం కోసం హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపారు. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ "జాన్ విక్", "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" వంటి చిత్రాలకు యాక్షన్ సీక్వెన్సెస్‌ను రూపొందించిన జెజె పెర్రీ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అదనంగా, "డ్యూన్ పార్ట్ 2 " కోసం బీఏఎఫ్టీ అవార్డు గెలుచుకున్న డీఎన్ఈజీ స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్ కోసం పని చేస్తోంది. ఈ భారీ బృందం, ప్రపంచ స్థాయి టెక్నాలజీతో కలిసి ఈ చిత్రాన్ని అద్భుతమైన స్థాయిలో రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News