క్రిస్మస్ కానుకగా రాబోతున్న కన్నడ ‘45’

లేటెస్ట్ గా శివ రాజ్‌కుమార్ తన సోషల్ మీడియాలో ఈ సినిమా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు.;

By :  K R K
Update: 2025-08-23 12:29 GMT

శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ మల్టీస్టారర్ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘45’. గాయకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో కన్నడనాట దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. మొదట ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా, పోస్ట్-ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ గా శివ రాజ్‌కుమార్ తన సోషల్ మీడియాలో ఈ సినిమా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు.

ప్రస్తుతం క్రిస్మస్ విడుదల కోసం మరో కన్నడ చిత్రం అనౌన్స్ మెంట్ రాలేదు. '45' పాన్-ఇండియా విడుదల కానుంది. కానీ తెలుగు, హిందీ మార్కెట్లలో అడివి శేష్‌ 'డెకాయిట్', ఆలియా భట్ 'ఆల్ఫా' చిత్రాలతో గట్టి పోటీ ఎదుర్కోనుంది. దర్శకుడు అర్జున్ జన్యా సోదరుడు.. కోవిడ్-19 సమయంలో మరణించిన వ్యక్తి. అతడు ఈ సినిమా కథకు స్ఫూర్తిగా నిలిచినట్లు తెలుస్తోంది.

సనాతన ధర్మం ప్రకారం.. ఒక వ్యక్తి మరణం తర్వాత 45 రోజుల వ్యవధి ఆత్మ పరలోకానికి చేరుకుంటుందా లేక పునర్జన్మ పొందుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతారు. ఈ కథ ఆ ఆలోచన చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని రమేష్ రెడ్డి సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.


Tags:    

Similar News