‘కాంతార‘ కోసం క్రేజీ డిమాండ్

ఇటీవల పంద్రాగస్టు సందర్భంగా రెండు డబ్బింగ్ మూవీస్ ‘కూలీ, వార్ 2‘ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాయి. అయితే.. పేరుకు అనువాద చిత్రాలైనా ఈ రెండు సినిమాల్లోనూ తెలుగు నటులు కీలక పాత్రలు పోషించారు.;

By :  S D R
Update: 2025-08-23 09:37 GMT

ఇటీవల పంద్రాగస్టు సందర్భంగా రెండు డబ్బింగ్ మూవీస్ ‘కూలీ, వార్ 2‘ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాయి. అయితే.. పేరుకు అనువాద చిత్రాలైనా ఈ రెండు సినిమాల్లోనూ తెలుగు నటులు కీలక పాత్రలు పోషించారు. అందుకే.. ఈ సినిమాలకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాల తర్వాత తెలుగులోకి రాబోతున్న మరో ఆసక్తికరమైన డబ్బింగ్ మూవీ ‘కాంతార.. ఛాప్టర్ 1‘. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార‘ చిత్రం తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించింది. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూళ్లను సాధించింది. ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా రాబోతున్న సినిమా కాబట్టే ‘కాంతార.. ఛాప్టర్ 1‘పై భారీ అంచనాలున్నాయి.

ఆ ఎక్స్ పెక్టేషన్స్ తోనే ఇప్పుడు తెలుగు సర్కిల్స్ లో ‘కాంతార‘ ప్రీక్వెల్ రేట్స్ ను ఓ రేంజులో కోట్ చేస్తున్నారట. ఈ సినిమా తెలుగు రైట్స్ కి రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నైజాం హక్కుల కోసం రూ.40 కోట్లు, ఆంధ్రా రైట్స్ కు రూ.45 కోట్లు, సీడెడ్ కోసం రూ.15 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మొదటి భాగం ఇచ్చిన అనూహ్య విజయంతో పాటు రిషబ్ శెట్టి దర్శకత్వంపై ఉన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లను ఆకర్షిస్తోంది. నిజంగా ఈ భారీ డీల్ కుదిరితే, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల రికార్డుల్ని ‘కాంతార.. ఛాప్టర్ 1‘ బద్దలు కొట్టడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News