‘ఓజీ’ టీమ్ కు పవన్ ప్రత్యేక సూచనలు !
ప్రత్యేకించి వీఎఫ్ఎక్స్ క్వాలిటీని ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా చూడమని పవన్ చెప్పాడట. సుజీత్.. తన పెర్ఫెక్షనిజంతో పాటు పవన్ ఫ్యాన్‌గా, టాప్-క్లాస్ ఔట్‌పుట్ ఇవ్వడానికి ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు.;
గ్యాంగ్‌స్టర్ డ్రామా “ఓజీ” బాక్సాఫీస్ వద్ద సోలోగా సందడి చేయడానికి రెడీ అవుతోంది. “అఖండ 2” టీమ్ తమ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్‌పోన్ చేయడంతో.. పవన్ కల్యాణ్ మూవీకి రూట్ క్లియర్ అయింది. ఈ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ తన షూటింగ్ పార్ట్‌ను ఎప్పుడో కంప్లీట్ చేశాడు. రీసెంట్‌గా టీమ్ రిలీజ్ చేసిన “ఫైర్‌స్టార్మ్” సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక ఈ మూవీనుంచి సెకండ్ సింగిల్ ప్రోమో కూడా డ్రాప్ కాబోతోంది. పవన్ కల్యాణ్ బర్త్‌డే సెప్టెంబర్ 2 దగ్గర్లో ఉండగా.. టీమ్ ఓ కొత్త వీడియో గ్లింప్స్‌ను రెడీ చేస్తోంది. కానీ.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు దాన్ని అనౌన్స్ చేయడం లేదు. డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు ప్రతి డీటెయిల్‌ను డబుల్ చెక్ చేయమని పవన్ ఆర్డర్ వేశాడట.
ప్రత్యేకించి వీఎఫ్ఎక్స్ క్వాలిటీని ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా చూడమని పవన్ చెప్పాడట. సుజీత్.. తన పెర్ఫెక్షనిజంతో పాటు పవన్ ఫ్యాన్‌గా, టాప్-క్లాస్ ఔట్‌పుట్ ఇవ్వడానికి ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. అయినా, పవన్ స్వయంగా క్వాలిటీని మానిటర్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌లో ఏ చిన్న మిస్టేక్ జరగకుండా కేర్ తీసుకుంటున్నాడు. మూవీలో పవన్ కల్యాణ్ ఓజస్ గంభీర రోల్‌లో కనిపిస్తాడు, అతని లవర్ కమ్ వైఫ్ కన్మణిగా ప్రియాంక అరుల్ మోహన్ కనిపిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.