‘టాక్సిక్’ లో క్రేజీ కన్నడ బ్యూటీ?

శాండల్‌వుడ్ అందం రుక్మిణి వసంత్‌ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. ఈ నటి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని షెడ్యూల్స్‌ని పూర్తి చేసినట్లు సమాచారం.;

By :  K R K
Update: 2025-08-19 01:27 GMT

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సాధించాడు రాక్ స్టార్ యశ్. అతడి రాబోయే చిత్రం 'టాక్సిక్'.. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రం 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ట్యాగ్‌లైన్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. శాండల్‌వుడ్ అందం రుక్మిణి వసంత్‌ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. ఈ నటి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని షెడ్యూల్స్‌ని పూర్తి చేసినట్లు సమాచారం. ఇటీవల, ఆమె అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1'లో అవకాశం దక్కించుకుని వార్తల్లో నిలిచింది.

రుక్మిణి ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, శివకార్తికేయన్‌తో 'మదరాసి' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకవేళ ‘టాక్సిక్‌’ లో రుక్మిణి ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమైతే.. ఇది ఆమె కెరీర్‌లో పెద్ద లీప్ అవుతుంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, తారా సుతారియా కూడా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వెంకట్ నారాయణ కేవీయన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Tags:    

Similar News