దర్శన్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ వచ్చేసింది !
‘డెవిల్’ సినిమా 2025 డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.;
శాండల్ వుడ్ హీరో దర్శన్.. తన అభిమాని రేణుకస్వామిని 2024 జూన్‌లో దారుణంగా హత్య చేయించిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను తదుపరి యాక్షన్ డ్రామా సినిమా ‘డెవిల్’ లో కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ, మొదటి సింగిల్‌ను తాజాగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
‘డెవిల్’ సినిమా 2025 డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా మొదటి పాట ను కూడా విడుదల చేశారు. ఈ మాస్ హీరో ఇంట్రో సాంగ్‌ను అజనీష్ లోకనాథ్ స్వరపరిచారు. ‘డెవిల్’ సినిమాను ప్రకాష్ వీర్ డైరెక్ట్ చేశాడు. రచన రాయ్, బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకాష్ వీర్, జె. జయమ్మ సంయుక్తంగా నిర్మించారు.
2024 జూన్ 11న అరెస్టయిన దర్శన్.. వైద్య కారణాలతో కర్ణాటక హైకోర్టు నుండి బెయిల్ పొందాడు. రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ రెండో నిందితుడిగా, అతని గర్ల్‌ఫ్రెండ్, నటి పవిత్ర గౌడ మొదటి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఆగస్టు 14న సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసింది, దీంతో అతను మళ్లీ జైలుకు వెళ్లాడు.