‘వేలెంటైన్స్ డే’ లక్ష్యంగా కిరణ్ అబ్బవరం సినిమా !
గతేడాది ‘క’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యూత్ స్టార్ .. కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా "దిల్ రూబా" కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ప్రమోషనల్ కంటెంట్‌లో కిరణ్ అబ్బవరం స్టైలిష్ లుక్‌లో, అదిరిపోయే స్వాగ్ అటిట్యూడ్‌తో మెరిసిపోతున్నాడు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఆకర్షణీయమైన డిజైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ యాక్షన్ కలయికతో "దిల్ రూబా" ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం స్టైలిష్ మార్పు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ విశ్వ కరుణ దర్శకత్వం వహిస్తున్నాడు. శివం సెల్యులాయిడ్స్, సారేగామా ఇండియా లిమిటెడ్ యూడ్లీ ఫిలిమ్స్ స్టూడియో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.