‘మా ప్రేమ పెరుగుతోంది’ - కిరణ్ భావోద్వేగం!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడిస్తూ, ఈ సందర్భంగా తన సతీమణి రహస్యతో దిగిన ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.;

By :  S D R
Update: 2025-01-21 07:43 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడిస్తూ, ఈ సందర్భంగా తన సతీమణి రహస్యతో దిగిన ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు ‘మా ప్రేమ పెరుగుతోంది‘ అంటూ భావోద్వేగమైన క్యాప్షన్ జతచేశాడు.

Kiran

కిరణ్-రహస్య జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కిరణ్ అబ్బవరం నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాలో రహస్య హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. చాలా రోజుల ప్రేమ తర్వాత గతేడాది వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.


సినిమాల విషయానికి వస్తే ‘క‘ వంటి ఘన విజయం తర్వాత ప్రస్తుతం కొత్త సినిమా ‘దిల్ రూబా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా ‘దిల్ రూబా‘ విడుదలకు ముస్తాబవుతుంది.



Tags:    

Similar News