హిట్టిచ్చిన దర్శకుడితో మరోసారి సుదీప్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. K47 (Kichcha 47) పేరుతో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నాడు.;
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. K47 (Kichcha 47) పేరుతో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మ్యాక్స్‘ (2024) మంచి విజయాన్ని అందుకుంది.
సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 7 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సుదీప్ స్టైలిష్ లుక్‌లో సిగరెట్ తాగుతున్న విజువల్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
మరోవైపు సుదీప్.. అనూప్ భండారి డైరెక్షన్ లో ‘బిల్లా రంగ బాషా‘ అనే ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఇది ‘హనుమాన్‘ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతుంది. ఇప్పటికే సుదీప్-అనూప్ కాంబోలో ‘విక్రాంత్ రోణ‘ వంటి హిట్ మూవీ వచ్చింది.