'కన్నప్ప' కీలక ఫుటేజ్ మాయం!

మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'కు అనుకోని షాక్ తగిలింది. చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని పరారైనట్లు సమాచారం.;

By :  S D R
Update: 2025-05-27 03:26 GMT

మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'కు అనుకోని షాక్ తగిలింది. చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని పరారైనట్లు సమాచారం. ఈ ఘటన చిత్ర యూనిట్‌లో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయకుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'కన్నప్ప' చిత్రం మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రముఖ స్టార్స్ ఈ మూవీలో భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పలు కీలక దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలు చిత్ర కథాంశంలో ముఖ్యమైన భాగం కావడంతో, హార్డ్ డ్రైవ్ మాయమవడం చిత్ర బృందానికి తీవ్ర ఆందోళన కలిగించింది.

సమాచారం ప్రకారం, రఘు అనే ఆఫీస్ బాయ్ ఈ హార్డ్ డ్రైవ్‌ను తీసుకుని ఆచూకీ లేకుండా పరారయ్యాడు. రఘు చిత్ర యూనిట్‌లో సాధారణ సిబ్బందిగా పనిచేస్తూ, షూటింగ్ సెట్‌లో సహాయక పనులు చేసేవాడు. అతని ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. హార్డ్ డ్రైవ్‌లోని ఫుటేజ్ లీక్ అయితే చిత్రానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్మాతలు భయపడుతున్నారు.

Tags:    

Similar News