డ్యాన్సుల్లో కుమ్మేసిన కళ్యాణ్‌రామ్

కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.;

By :  S D R
Update: 2025-03-30 11:33 GMT

కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో అర్జున్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతుండగా.. అతనికి తల్లి పాత్రలో వైజయంతి గా లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తుంది. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.

‘నాయాల్ది’ అంటూ సాగనున్న ఈ మాస్ నంబర్ రేపు (మార్చి 31న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా సాంగ్ ప్రోమో రిలీజయ్యింది. ఈ ప్రోమోలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. కళ్యాణ్, సయీ మంజ్రేకర్ మధ్య మాస్ నంబర్ గా ఈ సాంగ్ ఆకట్టుకోనున్నట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View



Tags:    

Similar News