ఏప్రిల్‌ నుంచి మొదలవ్వనున్న 'కల్కి 2'!

Update: 2025-01-16 01:50 GMT

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచరిస్టిక్ విజువల్ వండర్ 'కల్కి 2898 A.D'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, హాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచింది. సైన్స్ ఫిక్షన్‌కి మహాభారతం వంటి పౌరాణిక కథను మేళవించి రూపొందించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు సరికొత్త ఫ్యూచరిస్టిక్ అనుభూతిని అందించింది.

కల్కి కథ 'కలియుగం అంతం' అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో సాగింది. నాగ్ అశ్విన్ ఈ సినిమా ద్వారా మనం చేసే పనులు భవిష్యత్తు తరాల మనుగడపై ఎలా ప్రభావం చూపిస్తాయనే సందేశాన్ని ఇచ్చాడు. తొలిభాగం దీపికా పదుకునెను తీసుకెళ్లడం, కమల్ హాసన్ పాత్రపై మిస్టరీ వంటి అంశాలతో కథ సస్పెన్స్‌గా ముగిసింది.

ఇటీవల నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా సీక్వెల్‌ గురించి కీలక అప్‌డేట్స్ అందించారు. 'కల్కి 2' షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలవుతుందని తెలిపారు. సెకండ్ పార్ట్‌లో కథ మరింత డెప్త్‌గా, భావోద్వేగాలతో సాగనుందట. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రలు 'కల్కి 2'లో కీలకంగా ఉండబోతున్నాయని అశ్వనీదత్ చెప్పారు. మొత్తంగా 'కల్కి' వెయ్యి కోట్లు సాధించడంతో 'కల్కి 2' రెండు వేల కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్.

Tags:    

Similar News