ఒక నెలరోజుల పాటు సోషల్ మీడియాకు దూరం !

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే రష్మి, ఇప్పుడు ఓ ఎమోషనల్ అప్‌డేట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.;

By :  K R K
Update: 2025-07-24 01:41 GMT

టీవీ యాంకర్ అందాల రష్మి గౌతమ్.. తన అభిమానులను షాక్‌లో ముంచెత్తే ఓ వ్యక్తిగత ప్రకటన చేసింది. టీవీ షోలతో ఎప్పుడూ బిజీగా ఉండే రష్మి, ఒకప్పుడు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇప్పుడు ఆమె ఎక్కువగా స్మాల్ స్క్రీన్‌పైనే కనిపిస్తోంది, ముఖ్యంగా సుధీర్‌తో కలిసి చేసే షోల్లో ఆమె కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కు ఫేవరెట్. అయినప్పటికీ.. ఆమె టాలెంట్‌కు తగ్గ ఫేమ్, గుర్తింపు ఇంకా పూర్తిగా రాలేదని చాలామంది ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే రష్మి, ఇప్పుడు ఓ ఎమోషనల్ అప్‌డేట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

రష్మి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ హార్ట్ టచింగ్ పోస్ట్ షేర్ చేసింది. “ఒక నెల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో కాస్త లో ఫేస్‌లో ఉన్నాను.. సోషల్ మీడియా నీ ఆలోచనలను, నిర్ణయాలను కొంతవరకు మబ్బుల్లోకి నెట్టేస్తుంది..” అని ఆమె రాసుకొచ్చింది. ఈ మాటలు ఆమె ఇప్పుడు మానసికంగా, వృత్తిపరంగా ఓ కఠినమైన దశలో ఉన్నట్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఆన్‌లైన్ ఒత్తిడి, కామెంట్స్, ట్రోల్స్ లాంటి డిజిటల్ శబ్దం నుంచి దూరంగా ఉండి, తనను తాను రీఛార్జ్ చేసుకోవాలని ఆమె కోరుకుంటోంది.

“నేను మరింత స్ట్రాంగ్‌గా, మరింత ఫైర్‌గా తిరిగి వస్తానని ప్రామిస్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నాకు నా ఎనర్జీని రీన్యూ చేసుకోవాలి. డిజిటల్ నాయిస్ లేకుండా నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అందరూ నన్ను ఎప్పుడూ స్ట్రాంగ్‌గా, హ్యాపీగా చూస్తారు, కానీ లోపల నేను కొన్ని సమస్యలతో ఫైట్ చేస్తున్నా. నన్ను నేను ఫిక్స్ చేసుకోవాలి,” అని ఆమె ఓపెన్‌గా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ఆమె ఎంత సిన్సియర్‌గా, ధైర్యంగా తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందో చూపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా మనుషులే, వాళ్లకూ ఎమోషన్స్, స్ట్రగుల్స్ ఉంటాయని ఈ సందేశం గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News