రామోజీ ఫిల్మ్‌సిటీ వ్యాఖ్యలపై కాజోల్ వివరణ!

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీపై బాలీవుడ్‌ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారాన్ని రేపాయి.;

By :  S D R
Update: 2025-06-24 02:51 GMT

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీపై బాలీవుడ్‌ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారాన్ని రేపాయి. తన తాజా చిత్రం ‘మా’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామోజీ ఫిల్మ్‌సిటీలో రాత్రిపూట ఉండటం భయంగా అనిపించేదని, ఆ ప్రదేశం హాంటెడ్‌గా భావించబడుతుందని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు, తెలుగు సినీ ప్రేక్షకులు తీవ్రంగా స్పందించడంతో పాటు పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు.

ఈ విమర్శల నేపథ్యంలో కాజోల్ తన 'ఎక్స్' అక్కౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘నా వ్యాఖ్యలు పూర్తిగా నా సినిమా ‘మా’ ప్రచారంలో భాగంగా పేర్కొన్నవే. గతంలో ఎన్నోసార్లు రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్స్ చేశాను. అక్కడి వాతావరణం ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటుంది. పర్యాటకులు, ఫ్యామిలీలు ఎంతో భద్రతగా ఆనందంగా గడపగలిగే ప్రదేశం అది’ అని స్పష్టం చేశారు.

విశాల్ ఫురియా దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ హారర్ మూవీ ‘మా’లో కాజోల్ తల్లి పాత్రలో నటించారు. తన కుమార్తెను దుష్టశక్తుల నుంచి కాపాడే ఓ తల్లి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.



Tags:    

Similar News