‘కన్నప్ప‘ సినిమా ఆసక్తికర విశేషాలు!
పదేళ్ల క్రితం ఒక చిన్న సినిమాగా అనుకున్న ‘కన్నప్ప‘ ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నప్ప కథతో అంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి.;
పదేళ్ల క్రితం ఒక చిన్న సినిమాగా అనుకున్న ‘కన్నప్ప‘ ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నప్ప కథతో అంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప‘ పాత్రల్లో అలరించి ఘన విజయాలు సాధించారు.
మరోసారి ‘కన్నప్ప‘ కథతో సినిమా రూపొందించాలని నటుడు, రచయిత తనికెళ్ల భరణి భావించి కథను సిద్ధం చేశారు. తనికెళ్ల చిన్న బడ్జెట్లో సునీల్ హీరోగా ‘కన్నప్ప‘ను ప్లాన్ చేశారు. అయితే కథ విష్ణు చేతికి వెళ్లిన తర్వాత బడ్జెట్ భారీగా పెరిగింది. పలువురు రచయిలతో ఈ స్క్రిప్ట్ పరిధిని బాగా పెంచారు. మోహన్ బాబు నిర్మాణంలో ‘మహాభారత్‘ సీరియల్ ఫేమ్ ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడిగా ఫిక్సయ్యారు.
2023లో రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా ఎక్కువభాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ సాగింది. ఇందులో విష్ణు తనయుడు అవ్రామ్, కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు మోహన్ బాబు కూడా నటించారు. ఇలా మంచు కుటుంబానికి చెందిన మూడుతరాలు స్క్రీన్‌పై కనిపించడం విశేషం.
ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్‌లతో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు వంటి కమెడియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ఇక.. ఫస్ట్‌లుక్ నుంచి ట్రైలర్ వరకూ ప్రతి అప్డేట్ని విష్ణు సమయానికి ఇచ్చాడు.
మోహన్ బాబు బర్త్‌డే సందర్భంగా కామిక్ బుక్ విడుదల, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టీజర్ రిలీజ్, ప్రతీ సోమవారం ఓ ప్రమోషన్ అప్డేట్.. ఇలా సీరియస్ మార్కెటింగ్ చేశారు. పైగా దేశం అంతటా తిరుగుతూ గుళ్లు గోపురాలు సందర్శించడంతో ఈ సినిమాకి డెవోషనల్ టచ్ కూడా తీసుకొచ్చాడు.
సెన్సార్ బోర్డు 12 కట్స్ సూచించడంతో సినిమా నిడివి 195 నిమిషాల నుండి 182 నిమిషాలకు తగ్గింది. బడ్జెట్ విషయానికి వస్తే.. ఇది రూ.200-250 కోట్ల ప్రాజెక్ట్. అయినా ప్రభాస్, మోహన్‌లాల్ రెమ్యూనరేషన్ తీసుకోలేదన్నది ప్రత్యేక విషయం. ఇక సినిమా విడుదలకు ముందు ట్రోలింగ్‌ను ఊహించి, వాటిపై ఇప్పటికే లీగల్ వార్నింగ్ నోటీసులు జారీ చేసిన విష్ణు, ఈ సినిమా పట్ల తన దృక్పథాన్ని స్పష్టంగా చూపించాడు.