‘వార్ 2‘ రిలీజ్ కు కౌంట్ డౌన్
ఈ ఏడాది బాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'వార్ 2' ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.;
ఈ ఏడాది బాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'వార్ 2' ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్ తో ‘వార్ 2‘పై బజ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అంటే.. ఈరోజుకి మూవీ రిలీజ్ కు కేవలం 50 రోజులు మాత్రమే ఉంది. అదే విషయాన్ని తెలియజేస్తూ.. హీరోలు ఎన్టీఆర్, హృతిక్ సోషల్ మీడియా వేదికగా మూవీ పోస్టర్స్ ను షేర్ చేశారు.
ఈ పోస్టర్లలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో పాటు.. కియారా అద్వానీ లుక్ కూడా బయటకు వచ్చింది. మొత్తంగా.. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో భారీ స్థాయిలో ‘వార్ 2‘ విడుదలకు ముస్తాబవుతుంది.