జపాన్ ఫ్యాన్స్ డిమాండ్

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.;

By :  S D R
Update: 2025-03-27 04:15 GMT

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ చరణ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్‌లో రామ్ చరణ్‌కు ఉన్న అభిమానుల ప్రేమ మరోసారి కనిపించింది.

నిన్న అర్ధరాత్రి నుంచి సినీ ప్రముఖులు, సహా వేలాది మంది అభిమానులు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, జపాన్‌లోని అభిమానులు ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. భారీ స్థాయిలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతే కాకుండా, రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్'ను జపాన్‌లో కూడా థియేట్రికల్‌గా విడుదల చేయాలని అక్కడి అభిమానులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన డిమాండ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 'RRR' సినిమాతో చరణ్‌కు అక్కడ భారీ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో, 'గేమ్ ఛేంజర్' కూడా అక్కడ విడుదల చేయాలనే ఆశను జపాన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/whynotcinemasHQ/status/1905074836327837858

Tags:    

Similar News