‘జగదేకవీరుడు..‘ ఫస్ట్ డే కలెక్షన్స్
చిరంజీవి, శ్రీదేవి ఆల్ టైమ్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ తొలి రోజు వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి.;
By : S D R
Update: 2025-05-10 11:30 GMT
చిరంజీవి, శ్రీదేవి ఆల్ టైమ్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ తొలి రోజు వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో గ్రాండ్ గా రీరిలీజైన ఈ చిత్రానికి ఫస్ట్ డే రూ.1.75 కోట్లు వసూళ్లు దక్కాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ చిత్రం 2డితో పాటు 3డిలోనూ విడుదలైంది. ఇక ఈ శుక్రవారం విడుదలైన కొత్త చిత్రాలతో పోటీగా ‘జగదేక వీరుడు..‘ కలెక్షన్ల వర్షం కురిపించడం ఇప్పుడు విశేషంగా మారింది.
మొత్తంగా.. జగదేక వీరుడిగా చిరంజీవి, అతిలోక సుందరిగా శ్రీదేవి లను 3డిలో ఎక్స్ పీరియన్స్ చేస్తూ వింటేజ్ ఫీల్ కు లోనవుతున్నారు ఫ్యాన్స్. మరి.. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.