‘జాట్’ థీమ్ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘జాట్’.;
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘జాట్’. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న హిందీలో విడుదలకానుంది.
ఈ చిత్రంలో రణదీప్ హుడా ప్రతినాయకుడిగా, సయామీ ఖేర్, రెజీనా, జగపతిబాబు, రమ్యకృష్ణ, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లలోని మాస్ యాక్షన్ సీన్లు బాలీవుడ్ ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని కలిగించాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘జాట్‘ థీమ్ సాంగ్ రిలీజయ్యింది. సన్నీ డియోల్ ఎలివేషన్స్ తో ఆ సాంగ్ ఆకట్టుకుంటుంది.
మరోవైపు ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉన్నా డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో కొన్ని రోజులు ఆలస్యం కావచ్చని సమాచారం.