డబ్బింగ్ సినిమాల దూకుడు.. తెలుగు చిత్రాలకు వార్నింగ్ బెల్?

Update: 2025-03-09 05:36 GMT

2025లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల విశ్లేషణలో ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండు నెలలకు పైగా కాలంలో తెలుగు పరిశ్రమలో స్ట్రెయిట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు పోటీపడటం గమనించదగిన అంశం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల విజయ శాతం పెరుగుతుండడం పరిశ్రమలో కొత్త సంకేతాలను ఇస్తోంది.

జనవరిలో విడుదలైన ‘మార్కో’ ఆశించినంత ప్రభావం చూపకపోయినా, పెట్టుబడి రికవరీతో పాటు లాభాలను కూడా అందించింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘ది రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ కేవలం నాలుగు కోట్లకు అమ్ముడై, ఫైనల్ రన్ అయ్యేలోపు మూడింతల ప్రాఫిట్ అందించింది. ఇది డబ్బింగ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణను చాటిచెప్పే ఉదాహరణ.

ఈనెలలో విడుదలైన ‘ఛావా’ ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. హిందీ వెర్షన్ విడుదలైన చాలా రోజులకు తెలుగు వెర్షన్ వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు దీన్ని ఆదరించడం విశేషం. బుక్ మై షోలో లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడవడం, తొలి రోజు మూడు కోట్ల గ్రాస్ అందుకోవడం గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విజయాన్ని సూచిస్తున్నాయి.

మరోవైపు స్ట్రెయిట్ మూవీస్ విషయానికొస్తే సంక్రాంతి బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ జనవరిలో విడుదలైన మిగిలిన తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఫిబ్రవరిలో వచ్చిన ‘తండేల్’ రూ.100 కోట్ల గ్రాస్‌తో నాగచైతన్యకు భారీ విజయాన్ని అందించింది. అదే సమయంలో ఫిబ్రవరిలో మరే తెలుగు సినిమా విజయాన్ని సాధించలేకపోయింది.

Tags:    

Similar News