రాజమౌళి మౌనం వీడనున్నాడా? SSMB29 డీటెయిల్స్ ఎప్పుడు?
ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతుంది SSMB29. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండానే పట్టాలెక్కింది. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం షెడ్యూల్ జరుగుతుంది.
రాజమౌళి తన గత ప్రాజెక్ట్‌లకు భిన్నంగా, ఈసారి సినిమా ప్రారంభ వేడుక గురించి ఎలాంటి హడావిడి చేయలేదు. మామూలుగా అయితే జక్కన్న తన సినిమాల షూటింగ్ ప్రారంభం కాగానే, ఒక ప్రెస్ మీట్ ద్వారా మీడియాతో వివరాలు పంచుకోవడం అలవాటు. కానీ ఈసారి మహేష్ బాబు సినిమా విషయమై ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ లేదు.
తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి సమాయత్తమవుతున్నాడట. మార్చి నెలాఖరులో ఆయన మీడియా ముందుకు రావొచ్చని ఇన్సైడ్ టాక్. ఈ ప్రెస్ మీట్ ద్వారా సినిమా స్టోరీ, కాస్టింగ్, టెక్నికల్ టీమ్, బడ్జెట్, రిలీజ్ డేట్ వంటి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.
దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజులో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్ బాబును ఓ ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రియాంక చోప్రా మరో కీ రోల్ లో కనిపించబోతుంది. కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.