విజయ్ లీక్డ్ పిక్ వైరల్ అవుతోంది !

ఈ సినిమా గురించి చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించకపోయినా.. తాజాగా సెట్స్‌ నుంచి లీకైన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.;

By :  K R K
Update: 2025-05-12 04:12 GMT

దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయకన్’. ఈ సినిమా తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా గురించి చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించకపోయినా.. తాజాగా సెట్స్‌ నుంచి లీకైన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో విజయ్ పోలీస్ యూనిఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇది అతడి గత చిత్రం ‘తెరి’ లోని గెటప్‌ను గుర్తుకు తెస్తోంది. ఫొటోను పంచుకుంటూ ఓ అభిమాని, "జన నాయకన్ షూటింగ్ స్పాట్... విజయ్ కుమార్ తిరిగొచ్చాడు" అంటూ ట్వీట్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దళపతి విజయ్ 69వ ప్రాజెక్టు కావడం విశేషం. ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రాజకీయ ప్రస్థానానికి ముందు విజయ్‌కి ఇదే చివరి చిత్రం కావడం వల్ల అభిమానుల్లోనూ సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది.

Tags:    

Similar News