దృష్టంతా ఆ మూవీ సీక్వెల్ పైనే !

కోలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే, విజయ్ సేతుపతి, డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ‘మహారాజా 2’ కోసం ఫుల్ జోష్‌లో ప్లాన్స్ వేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-06-22 00:42 GMT

తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నాడు. ‘పిజ్జా’ లాంటి కల్ట్ క్లాసిక్, ‘ఉప్పెన’ లాంటి ఎమోషనల్ డ్రామాలకు తెలుగు జనాలు అతని టాలెంట్‌కి ఫిదా అయిపోయారు. అయితే, ‘ఉప్పెన’ సినిమా అతన్ని తెలుగు ఆడియన్స్‌తో ఒక డీప్ ఎమోషనల్ కనెక్ట్‌తో బంధించింది. అతని తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయినా, అవి ఆశించిన స్థాయిలో హిట్టవ్వలేదు . కానీ, గత ఏడాది ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ అయిన ‘మహారాజా’ మాత్రం ఊహించని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.

‘మహారాజా’ సక్సెస్ స్టోరీ థియేటర్ల వరకే ఆగిపోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చాక, ముఖ్యంగా తెలుగు వెర్షన్, నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉండి సంచలనం సృష్టించింది. ఈ క్రేజ్ చూస్తే, ఆడియన్స్‌లో సీక్వెల్ కోసం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. కోలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే, విజయ్ సేతుపతి, డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ‘మహారాజా 2’ కోసం ఫుల్ జోష్‌లో ప్లాన్స్ వేస్తున్నారు.

నితిలన్ స్వామినాథన్.. ఈ యంగ్ డైరెక్టర్ ‘మహారాజా’తో తన ఫస్ట్ అటెమ్ట్ లోనే సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత అతనికి బడా స్టార్స్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ, నితీలన్ ఫోకస్ మాత్రం సేతుపతితో సీక్వెల్ చేయడంపైనే ఉంది. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, సీక్వెల్ స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ స్టేజ్‌లో ఉంది. విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తన బిజీ షెడ్యూల్‌లో స్పెషల్ టైమ్ కేటాయించడానికి రెడీగా ఉన్నాడట. త్వరలోనే ఈ సీక్వెల్‌కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్.

Tags:    

Similar News